పోలీస్ శాఖ, ముఖ్య అతిథులు
విశాలాంధ్ర ధర్మవరం: విద్యార్థులు అందరూ కూడా తమ భవిష్యత్తు కోసం రక్షకు దూరంగా ఉండాలని, అప్పుడే ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుందని టూటౌన్ సీఐ రెడ్డప్ప, రూరల్ సీఐ శ్యామ్ రావు, ఆర్డీవో కార్యాలయ ఏవో కతిజున్ కుప్రా, తాసిల్దార్ సురేష్ కుమార్, లాయర్ బాల సుందరి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో, ప్రభుత్వ బాలికాల బాలుర విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్ లు, ధర్మవరం రెవెన్యూ డివిజన్ పోలీస్ శాఖ సిబ్బంది లతో వారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా పెద్ద ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ర్యాలీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ సర్కిల్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి డ్రగ్స్ నివారణపై అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు. తదుపరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వివిధ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ నేటి సమాజంలో డ్రగ్స్ అనేది విద్యార్థుల, యువతీ, యువకుల భవిష్యత్తును నాశనం చేస్తుందని తెలిపారు. ఈ డ్రగ్స్ వినియోగం వల్ల కుటుంబం తీవ్రంగా నష్టపోవడమే కాకుండా తల్లిదండ్రులు మానసిక శోభను కూడా అనుభవిస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ క్రయవిక్రయాలు జరిగితే పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను నగరం, ఇతర ప్రాంతాలలో ఉన్నత చదువులకు పంపిస్తున్నారని, అనుకోని పరిస్థితుల వలన డ్రగ్స్ కు బానిస కావడం నిజంగా బాధాకరమన్నారు. ఇటువంటి వారికి కౌన్సిలింగ్లో ఇప్పించి, డ్రగ్స్ నివారణ పట్ల కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. నేటి సమాజంలో యువతను డ్రగ్స్ నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. డ్రగ్స్ పై చికిత్స ప్రాసిక్యూషన్ మినహాయింపు వంటి చర్యలు కూడా చేపట్టడం జరగాలన్నారు. మీ జీవితం డ్రగ్స్ రహితమైతే ఆనందమైన జీవితం మీ చేతుల్లోనే ఉండిపోతుందని తెలిపారు. గంజాయి కి దూరంగా ఉండాలని మంచి జీవితం పొందాలని తెలిపారు. మన చుట్టూ ఉన్నవారు, సమాజం మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటేనే సమాజం బాగుంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ చంద్రమణి, రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ప్రభుత్వ బాలుర, బాలికల అధ్యాపకులు, విద్యార్థులు, ప్రిన్సిపాల్ లు, డివిజన్లోని పోలీస్ శాఖ సిబ్బంది, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం డ్రగ్స్ కు దూరంగా ఉండాలి..
- Advertisement -
RELATED ARTICLES


