Wednesday, January 22, 2025
Homeజాతీయంజేఈఈ ఎగ్జామ్స్.. నిమిషం ఆలస్యం.. బోరుమంటున్న విద్యార్థులు

జేఈఈ ఎగ్జామ్స్.. నిమిషం ఆలస్యం.. బోరుమంటున్న విద్యార్థులు

జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్ష రాసేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. సమయం కంటే ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు ఉదయమే విద్యార్థులు చేరుకున్నారు. అయితే నిర్దేశిత సమయంలోపు వచ్చిన వారినే సిబ్బంది పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.ఈ క్రమంలో విశాఖలో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా ఎగ్జామ్స్‌ సెంటర్స్ వద్దకు వచ్చారు. విశాఖలోని ఇయాన్ డిజిటల్ జోన్‌ ఎగ్సామ్స్ సెంటర్‌కు ఈ ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో వారిని పరీక్ష రాసేందుకు అక్కడి సిబ్బంది అనుమతించలేదు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యం ఆయినా అనుమతించరాదని అధికారులు నిబంధన విధించారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయలేకపోయారు. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం పగులు రాత్రి కష్టపడి చదివి.. తీరా ఎగ్జామ్ రాసే సమయానికి ఇలా జరగడంతో ఆ విద్యార్థులు బోరున విలపిస్తున్నారు. పరీక్ష రాసేందుకు అనుమతివ్వాలని విద్యార్థులు అక్కడి సిబ్బంది వేడుకున్నప్పటికీ అందుకు వాళ్లు అంగీకరించలేదు. దీంతో తీవ్ర ఆవేదనతోనే సదరు విద్యార్థులు పరీక్షా కేంద్రం నుంచి వెనుదిరిగారు.

రెండు దఫాల్లో పరీక్షలు…

మరోవైపు జేఈఈ మెయిన్స్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షన్నర మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. మరల మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 7:30 వరకు హాల్ టికెట్ నంబర్లు చూసుకునేందుకు ఎగ్జామ్స్ సెంటర్ నిర్వాహకులు ఏర్పాటు చేయపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా.. మొదటి దశ పరీక్షలు ఈ నెల 22 నుంచి 24 వరకు, రెండో దశ పరీక్షలు 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1ను నిర్వహించనున్నారు. చివరి రోజు 30న బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌-2 జరుగనుంది. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికిపైగా ఈ పరీక్షను రాయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 15 పట్టణాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు