విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : జిల్లాలో పలు పరిశ్రమలు,ఎంఎస్‌ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపనలు చేశారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 ఎంఎస్‌ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో రూ. 2750 కోట్ల పెట్టుబడితో ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి, గుట్టపాడు లో 206 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఆర్ పి ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశారు. ఈ పరిశ్రమల ద్వారా 2835 మందికి ఉపాధి లభించనుంది.అలాగే పెద్ద కడుబూరు మండలం హెచ్ మురవణి, దేవనకొండ మండలం కప్పట్రాళ్ల, ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి లో 76.24 ఎకరాల్లో రూ. 30.62 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎమ్‌ఎస్‌ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.ఇవి కాక కర్నూలు ఎయిర్ పోర్ట్ లో వంద కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే పర్యాటకాభివృద్ధికి తోడ్పాటు అందించడంలో భాగంగా మంత్రాలయం పుణ్యక్షేత్రంలో భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు రూ. 97 కోట్ల పెట్టుబడితో శ్రీ వెంకటేశ్వర లాడ్జి ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1.2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఆధునిక హోటల్, రెస్టారెంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాడు నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరుచరితారెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ చైర్మెన్ కప్పట్రాళ్ళ బొజ్జమ్మ, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, మెల్ స్టార్ ఏవియేషన్స్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ కశ్యప్, సెట్కూరు సీఈఓ డా.వేణు గోపాల్, కర్నూలు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యా సాగర్, డిఐఓ ప్రవీణ్ రెడ్డి, డీఈ అమృత్ తదితరులు పాల్గొన్నారు
జిల్లాలో పలు పరిశ్రమలు వర్చువల్ గా శంకుస్థాపనలు చేసిన సీఎం
- Advertisement -
RELATED ARTICLES


