పైడి ఐ.టి.ఐ ప్రాంగణంలో జాబ్ మేళా
విశాలాంధ్ర – తాళ్లపూడి: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొవ్వూరు నియోజకవర్గం లోని శ్రీ పైడి ఐటీఐ ప్రాంగణంలో నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ నేతృత్వం లో జరిగిన జాబ్ మేళాలో ప్రముఖ పాటిల్ గ్రూవ్, రాజేంద్ర ఎనర్జీ సొల్యూషన్ నందు గల పలు ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించగా ఆయన తెలిపారు. జాబ్ మేళా” కు హాజరయిన 49 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు 33 మందిని ఎంపిక ఆయనట్లు ఆయన తెలిపారు.


