Homeఆంధ్రప్రదేశ్ఖోఖో పోటీలకు

ఖోఖో పోటీలకు

- Advertisement -

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన నల్లజర్ల విద్యార్థులు

విశాలాంధ్ర – నల్లజర్ల : ఇటీవల గోపన్నపాలెం వ్యాయామ విద్యా కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి ఖో ఖో పోటీలలో. అండర్ 17 విభాగంలో నల్లజర్ల హై స్కూల్ ప్లస్ విద్యార్థినిలు బేత ఉదయ పోసేశ్వరి మైనం దుర్గ భవానీలు ప్రతిభ కనబరిచి నందున. ఈనెల 23. 24. 25.వ. తేదీలలో విజయనగరంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తరఫున పాల్గొననున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చాగంటి కోమలి చిత్ర తెలిపారు. విద్యార్థినిలు వ్యాయామ ఉపాధ్యాయులు, పి. వెంకట అప్పారావు. కే. రాంబాబు. వి. సుబ్రహ్మణ్యం. లను పాఠశాల కమిటీ చైర్మన్, కోడూరి నారాయణ. గ్రామ పెద్ద, పల్లి సుబ్బారావు. హెచ్ఎం అభినందించారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు