పరిసరాల పరిశుభ్రతను పాటించాలి
విశాలాంధ్ర – నిడదవోలు : పరిసరాలను పరిశుబ్రత ప్రతి ఒక్కరూ బాధ్యత అని మండల అభివృద్ధి అధికారి టివి సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరిశుభ్రం,పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఉనకరమిల్లిలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎంపీడీవో టి.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను, పారిశుద్ధ్య పని తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రతగా ఉంచాలన్నారు. నూరుశాతం పన్నుల వసూళ్ళు పై దృష్టి సారించాలని గ్రామాధికారులకు సూచించారు. స్వర్ణపంచాయితీ అమలులో భాగంగా ఇంటిపన్నులు డిజిటల్ చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ యంపిడిఓ శ్రీనివాసరెడ్డి, మండలంలోని పంచాయితీ కార్యదర్శులందరూ, ఉనకరమిల్లి సర్పంచ్ పోలీరెడ్డి భారతి లక్ష్మి కాంతమ్మ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం, మల్లుల ప్రసాద్ ,పాల వీరాస్వామి, కరిబండి మణికంఠ తదితరులు పాల్గొన్నారు


