మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా గోకవరం గ్రామంలో కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ శ్రేణులు
విశాలాంధ్ర – గోకవరం : వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం,రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, విద్యార్థి విభాగం జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్, తోట శ్రీ రాంజీ అదేశాలు మేరకు ఎంపీపీ సుంకర శ్రీవల్లీ వీరబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ గోకవరం సంజీవయ్య నగర్ లో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని, పేద, బడుగు బలహీన వర్గాలకు, విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారుతుందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి నచ్చిన వారికి దోచి పెట్టే విధంగా జీవోలు ఉంటున్నాయని ఇలాంటి విధానాలను మానుకోవాలని మాను కునేంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటలు చేస్తూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్సార్ సీపీ రైతు విభాగం జాయింట్ సెక్రటరీ దాసరి చినబాబు, వైసీపీ నాయకులు సుంకర వెంకట రమణ,జిల్లా వైస్సార్ సీపీ టి.యూ.సి.విభాగం ఉపాధ్యక్షులు నారాలశెట్టి నరసయ్య,జిల్లా వైస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం సెక్రటరీ అంబటి అబ్రహం, రాష్ట్ర వైస్సార్ సీపీ ఎస్సి సెల్ విభాగం సెక్రటరీ తోలేటి రాంప్రసాద్,గోకవరం మండల వైస్సార్ సీపీ ఎస్సి సెల్ అధ్యక్షులు బిజ్జి రాజు, గోకవరం టౌన్ ఉపాధ్యక్షులు మచ్చ మురళి,వీర్ల వెంకటేశ్వరరావు,గోకవరం వైస్సార్ సీపీ టౌన్ అధ్యక్షులు బాడితబోయిన చిన్న,గోకవరం మండల కమిటీ వైస్సార్ సీపీ ఎడ్యుక్యూటి మెంబర్ నండూరి బుజ్జి,యువజన విభాగం అధ్యక్షు బొర్రా శేఖర్,మండల వైస్సార్ సీపీ సెక్రటరీ బొడ్డపాటి వీరచంద్రం నాగేంద్రుడు,మహిళలు పాల్గొన్నారు.


