కులమతాలకు అతీతంగా జీవించాలి
– సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి
– బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు
విశాలాంధ్ర – రాజానగరం : మనమంతా భారతీయులమని కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు,బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు
అన్నారు. రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భవాని సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం రాత్రి జరిగిన లక్ష దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కంబాల శ్రీనివాసరావును ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానించి సత్కరించారు.అలయంలో స్వామి వారిని దర్శించుకొని,పూజలు నిర్వహించారు. గ్రామస్థులతో కలిసి కార్తీక దీపాలను వెలిగించారు. దీంతో ఆ ప్రాంతమంతా దీప కాంతులతో శోభాయమానంగా సంప్రదాయబద్ధంగా నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానన్నారు. ఆలయం వద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సహకారం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు కంబాల శ్రీనివాసరావు కోరారు. స్పందించిన ఆయన లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఆళ్ల శివ నాగ రాజు,బీజేపీ నాయకులు బత్తుల నానాజీ, పెద్దాడ వెంకన్న దొర, నాగ రమేష్, దేశాల నరేష్, మండే గౌతంమ్, నండూరి దుర్గారావు, రాంబాబు, కమిటీ సభ్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
కులమతాలకు అతీతంగా కంబాల
- Advertisement -
RELATED ARTICLES


