విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : బీటీ నాయుడుకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంపై ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం పెద్దకడబూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ టీడీపీని నమ్ముకొని కష్టపడి పనిచేసే బడుగు బలహీన వర్గాలకు చెందిన బీటీ నాయుడుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గం ముద్దు బిడ్డ బీటీ నాయుడు భవిష్యత్తులో ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని కోరారు.