విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), నార్పలలో 2025–26 ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రథమ సంవత్సరంలో 39 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాన్ని నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరంలో 27 మంది విద్యార్థులకు గాను 24 మంది ఉత్తీర్ణత సాధించగా, 3 మంది అనుతీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో జి. సురేఖ 472/500 మార్కులు సాధించి అత్యధిక మార్కులు పొందింది. ఆమె తండ్రి ఎస్. బొమ్మన్న (మరణించారు), తల్లి ఎస్. తిమ్మక్క. ద్వితీయ సంవత్సరంలో పి. మనీషా 937/1000 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తండ్రి పి. నారాయణ స్వామి, తల్లి పి. శివకల, వృత్తి రైతు, చిరునామా చిల్లవారిపల్లి, తాడిమరి మండలం. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల శ్రమ ఫలితంగానే ఈ మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.


