Homeజిల్లాలుశ్రీ సత్యసాయికృష్ణపురం ఆఫ్సర్ కి ఉత్తమ రక్తదాత అవార్డు

కృష్ణపురం ఆఫ్సర్ కి ఉత్తమ రక్తదాత అవార్డు

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం : ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా రక్త బంధం ట్రస్ట్ సభ్యుడు, మనం ఫౌండేషన్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కమిషన్ సభ్యుడు ధర్మవరం పట్టణానికి చెందిన కృష్ణాపురం ఆఫ్సర్ కి మనం పౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వారి నుంచి బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు- 2025 లభించింది. అప్సర్ గత 6 సంవత్సరాలుగా రక్తదానం చేయడమేకాక రక్తదాన శిబిరాలు, తలసేమియా వ్యాధి గ్రస్తులకు సమయానికి బ్లడ్ అందించే సేవలతో చురుగ్గా పాల్గొంటున్నందుకు వారి అత్యుత్తమ సేవలను గుర్తించి ,ఈ బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డుకు ఎంపిక చేసామని మనం ఫౌండేషన్ అధ్యక్షులు చైర్మన్ అడ్వకేట్ డాక్టర్ చక్రవర్తి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డా.కృష్ణపురం ఆఫ్సర్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆఫ్సర్ మాట్లాడుతూ ఈ అవార్డు లభించినందుకు సంతోషంగా ఉందని,అలాగే మరింత బాధ్యత పెంచిందని, అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మనం కూడా మన స్నేహితులని రక్తదానం వైపు ప్రోత్సహిస్తూ మనవత్వాన్ని చాటుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు