పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలి
పి ఎస్ యు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరంలో పట్టణంలో ఫిబ్రవరి 25,26 వ తేదీలలో జరుగు ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర మూడో మహసభలు జయప్రదం చేయాలని ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో కరపత్రాలువిడుదల చేయడం జరిగిందని పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర కార్యదర్శి సుబ్బరాయుడు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ,పిజీ ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సంబందించి పెండింగ్లో వున్న 3,580 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ను విడుదల చేయాలనీ జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజుల దోపిడీలను అరికట్టాలని ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుచేయాలని తెలిపారు.అలాగే సూపర్ సిక్స్ లో భాగమైన తల్లికివందనం వెంటనే విడుదల చేయాలనీ తెలిపారు.ఈ హాసభలలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి, భవిష్యత్ ఉద్యమాలకు సిద్దమవుతున్నట్లు తెలిపారు.ఈ మహాసభలకు ముఖ్య అతిధులుగా పిఎస్ యు జాతీయ కార్యదర్శి మహమ్మద్ షఫి ఉల్లా హాజరు అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ యు పట్టణ అధ్యక్షులు నందకిషోర్,గునవరణ్, సాయి, భాస్కర్, కిరణ్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
పి ఎస్ యు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
RELATED ARTICLES