Homeజిల్లాలుఅనంతపురంఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం ..

ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం ..

- Advertisement -

విశాలాంధ్ర గుంతకల్లు.. అక్టోబర్ 31 తేదిన నిర్వహించే ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బి గోవిందు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏఐటీయూసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బి గోవిందు హాజరయ్యారు. సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ గోపీనాథ్ అద్యక్షతన వహించిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బి. గోవిందు మాట్లాడుతూ 31 తారీఖున జరగబోవు ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి మున్సిపల్ కార్మికులు, మిల్లు హమాలీ కార్మికులు, పాత గుంతకల్ హమాలి కార్మికులు, తప్పకుండా హాజరు కావలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శులు టి సురేష్, జి ఈశ్వరయ్య, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎండి గౌస్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ ,సహకార్యదర్శి రామాంజనేయులు, సిపిఐ నాయకులు దాసరి శ్రీనివాసులు, మల్లయ్య, మిల్లు హమాలి నాయకులు మల్లికార్జున, శీన, హనుమప్ప, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు