విశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ కార్యక్రమాలు లో భాగంగా రెండవ రోజు విద్యార్థులకు వేమన పద్యాలు, నాటకాలు గూర్చి తెలియజేశారు. ముఖ్య అతిథులుగా ఎల్ఐసి నాగరాజు సిహెచ్ వెన్నెల పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలోవిద్యార్థులకు వేమన పద్యాలు తెలియజెప్పడం జరిగిందని పిల్లలకు నాటకం గూర్చి కూడా తెలపడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఏ విధంగా చదవాలి అనే అంశాన్ని కూడా వారు వివరించారు అని తెలిపారు. 30 మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.. అంజలి సౌభాగ్యవతి
RELATED ARTICLES