– సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం: మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ న్యాయవాదుల ద్వారా సహాయ సహకారాలు, ప్రణాళికలు గూర్చి చర్చించారు. అదేవిధంగా కేసులను నిర్ధారించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. అందరూ న్యాయవాదులు సమన్వయంతో ముందుకు వస్తూ తమ సహాయ సహకారాలను అందించాలని వారు తెలిపారు. ఈ లోక్ అదాలత్ ను అన్ని వర్గాల వారు ఉపయోగించుకుని తమ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం కోర్టు యూనిట్కి మంచి పేరు తీసుకుని రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ నందిని, బారు ఉపాధ్యక్షులు నూరు మొహమ్మద్, సీనియర్ న్యాయవాది హేమంత్ కుమార్, కృష్ణారెడ్డి, నరేంద్ర, భార్గవి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి
- Advertisement -
RELATED ARTICLES


