విశాలాంధ్ర నందిగామ :-వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఐతవరం శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫీ వద్ద నేషనల్ హైవే 65 పై శనివారం తెల్లవారుజామున జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం తోటరాములపాడు గ్రామానికి చెందిన స్వామి ఉదయాన్నే తన మోటార్ వాహనంపై హైవేపై వెళుతున్న సమయంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి వోల్వా బస్సు బలంగా ఢీకొట్టడంతో అక్కడకక్కడే స్వామి మృతి చెందినట్లు 108 సిబ్బంది ధ్రువీకరించారు అనంతరం మృతదేహాన్ని నందిగామ మాత్రికి తరలించారు పోలీసులు వాల్వా బస్సు డ్రైవర్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు….
వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి…
- Advertisement -
RELATED ARTICLES


