–ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు
మండపేట- మండలం: పేకేటి పాకలు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు ఆ గ్రామ కూటమి నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమక్షంలో వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో పిల్లి ధనరాజు, గుత్తుల వెంకటరమణ, బొక్కా గంగాధరావు, వాసంశెట్టి వెంకట్రావు, ఇళ్ల వెంకట్రావు, పితాని సత్యనారాయణ, అబ్బులు, కడియాల నాగేశ్వరరావు, మేడిశెట్టి ఆనందరావు, కొప్పిశెట్టి సత్తిబాబు, వాసంశెట్టి వెంకటరావు, ఇళ్ల శ్రీనివాసు, బొక్కా సత్యనారాయణ, అనసూరి కోటేశ్వరరావు, కడియాల సుబ్బారావు, పితాని వెంకటేశ్వర్లు, పంపన శ్రీను, బవిరిశెట్టి రాజేష్ లు ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


