Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికళ్లు పట్ల విద్యార్థులు జాగ్రత్త వహించాలి

కళ్లు పట్ల విద్యార్థులు జాగ్రత్త వహించాలి

- Advertisement -

వైద్యాధికారి డాక్టర్ పుష్పలత

విశాలాంధ్ర ధర్మవరం: కంటిపట్ల విద్యార్థులు జాగ్రత్తలు వహించాలని వైద్యాధికారి డాక్టర్ పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం మండలం దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని గొట్లూరు హై స్కూల్ , ఎలిమెంటరీ స్కూల్ నందు గతంలో విద్యార్థిని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఎవరికైతే కంటి అద్దాలు అవసరమో వారిని గుర్తించి వారికి దర్శనముల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత , కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాంబశివమ్మ ,ఆప్తోల్మిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప ,హెడ్మాస్టర్ జగన్నాథం ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది మొత్తం 7 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది అని వారి తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాంబశివమ్మ ,హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ ఆంజనేయులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు