Homeఆంధ్రప్రదేశ్బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు..20 మంది మృతి

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు..20 మంది మృతి

- Advertisement -

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో స్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే 20 మంది కార్మికులు మంటల్లో చిక్కుకునట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకి తీసుకురావ‌డానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాథమికంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం లేదా పేలుడు పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పేలుడు ఘటనపై ఆరా తీశారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలికి వెళ్లాలని హోం మంత్రి అనితను ఆదేశించారు. ఈ మేరకు హోం మంత్రి అనిత అక్కడికి బయల్దేరారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు