విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… భోగి మంటల వెచ్చదనం, రంగవల్లుల సోయగం, గాలిపటాల సందడి, డూడూ బసవన్నల నాట్యాలు, కొత్త ధాన్యపు రాశులతో తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వైభవంగా కొనసాగుతున్న వేళ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజలకు మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన స్వగృహం బృందావనంలో కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి సంక్రాంతి సాంప్రదాయమైన కోడిపందాలను సరదాగా నిర్వహించి వీక్షించారు. గ్రామీణ వాతావరణంలో సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. సంక్రాంతి అంటే రైతుల పండుగ అని పేర్కొన్న ఎమ్మెల్యే అమిలినేని, నిత్యం కష్టపడి పంట పండించే రైతన్నలకు ఈ కాలం ఆనందం నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతి కరుణించి కళ్యాణదుర్గం ప్రాంతం మరింత సస్యశ్యామలంగా మారాలని, ప్రతి రైతుకు తగిన ప్రతిఫలం లభించి ప్రతి ఇంట సిరులు పండాలని మనసారా కోరుకున్నారు. ఈ మకర సంక్రమణం అందరి జీవితాల్లో చీకట్లను తొలగించి కొత్త వెలుగులను నింపాలని, ఆ వెంకటేశ్వరుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆశిస్తూ మరోసారి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.


