విశాలాంధ్ర బొమ్మనహళ్, మండలంలోని లింగదహాల్ గ్రామంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదం రైతును తీవ్రంగా దెబ్బతీసింది. గ్రామానికి చెందిన ఎర్రిస్వామి అనే రైతుకు సంబంధించిన సుమారు 30 ఎకరాల పశుగ్రాసం వాము ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘటనతో రైతుకు సుమారు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు. పాదచారులు బీడీ తాగి పారేయడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పొడిగడ్డిపై పడడంతో మంటలు వేగంగా వ్యాపించి పశుగ్రాసం మొత్తాన్ని చుట్టుముట్టాయి. మంటలు చెలరేగగానే గ్రామస్తులు తక్షణమే మంటలు ఆదుపు చేసే ప్రయత్నించారు. మంటలు అదుపుకాకపోవడంతో రాయదుర్గం ఫైర్ ఇంజన్ ను పిలిపించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ అగ్నిప్రమాదంతో పశువుల కోసం నిల్వ చేసిన పశుగ్రాసం పూర్తిగా కాలి బూడిద కావడం తో ఎర్రిస్వామి తీవ్ర ఆందోళన గురయ్యారు. బాధితుడిని అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


