Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆలయానికి ఆలయ కమిటీ విరాళం

ఆలయానికి ఆలయ కమిటీ విరాళం

- Advertisement -


విశాలాంధ్ర ధర్మవరం; మండలంలోని యాదవ వీధిలో స్వయంభుగా వెలసిన శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక దేవాలయ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా దాతల సహకారంతో నిర్మాణ పనులు త్వరితగతిన నిర్వహించబడుతున్నవి. ఇందులో భాగంగా నేడు విరాల దాత కీర్తిశేషులు కుంచపు హనుమప్ప, ధర్మపత్ని కీర్తిశేషులు నాగమ్మ ల జాపకార్థం వారి కుమారుడు కుంచపు లక్ష్మీప్రసాద్, ధర్మపత్ని లక్ష్మీకాంతమ్మలు ఆలయ దేవాలయా అభివృద్ధి కమిటీ వారికి రూ .5,01,116 భూరి విరాళమును అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ వారు వీరి పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతలు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దేవాలయాల అభివృద్ధి, కార్యక్రమాల తోడ్పాటుకు ప్రతి ఒక్కరూ చేత ఇవ్వడం ఒక శుభదాయకమని వారు తెలిపారు. ఇంకను దాతలు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు