Sunday, December 7, 2025
Homeజిల్లాలువిజయనగరంపత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం రైతులకు శుభవార్త. పత్తి రైతులకు నేరుగా లాభం చేకూర్చేందుకు రాజాం మార్కెట్ యార్డు లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది. బుధవారం ఈ కేంద్రాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పత్తి పంటకు ప్రభుత్వం క్వింటాకు ₹8,110 మద్దతు ధర నిర్ణయించడం రైతు సంక్షేమానికి నిదర్శనమన్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు మారుతూ ఉండటం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో, ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా అమ్మితే రైతులు నష్టాలకు గురి కాకుండా నేరుగా ఎంఎస్పి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులు కేంద్రాన్ని వినియోగించుకోవాలని, బిల్లింగ్, తూకం, చెల్లింపులు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని భరోసా ఇచ్చారు. రైతులు పత్తిని మార్కెట్‌కి తెచ్చే సమయంలో అవసరమైన దస్తావేజులు వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్, రైతు సంఘాల ప్రతినిధులు, టిడిపి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు