విశాలాంధ్ర – కడియం : 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా , కడియం ఎంపిడిఓ కె. రమేష్ జిల్లా ఉత్తమ సేవా పురస్కారం పొందారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ నందు శుక్రవారం జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి చేతులు మీదుగా సేవా పురస్కారాన్ని ఎంపిడిఓ రమేష్ అందుకున్నారు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల ఉద్యోగులు కృషి, సహకారం వల్లనే ఈ పురస్కారం పొందానని ఎంపిడిఓ రమేష్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు ఎంపిడిఓ రమేష్ కు అభినందనలు తెలియజేశారు
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఎంపిడిఓ.
- Advertisement -
RELATED ARTICLES


