Homeఆంధ్రప్రదేశ్పల్ల వెంకన్న నర్సరీలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.

పల్ల వెంకన్న నర్సరీలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, కడియపులంక, పల్ల వెంకన్న నర్సరీలో త్రివర్ణ జెండా రెపరెపలాడింది. పంద్రాగస్టు వేడుకను దృష్టిలో పెట్టుకొని నర్సరీ యాజమాన్యం ప్రతి ఏటా మొక్కల కూర్పుతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతుంది. ఆ ఆకృతిలో ఏదో ఒక సందేశాన్ని నింపుతుంది. ఈ ఏడాది కూడా అద్భుతమైన కూర్పుతో 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను నర్సరీ యాజమాన్యం పల్ల సత్యనారాయణమూర్తి, వెంకటేష్,, వినయ్ లు తెలిపారు. అమెరికా వంటి సంపన్న దేశాలు తీసుకున్న నిర్ణయంతో రూపాయి విలువ ఎక్కడ తగ్గకుండా మనమే స్వదేశీ వస్తువులకు కొనుగోళ్ల కు ప్రాధాన్యత ఇవ్వాలని వారు సందేశాన్ని ఇచ్చారు.  బోర్డర్  రకానికి చెందిన కొన్ని వేల మొక్కలతో మేడిన్ ఇండియా, ఇండిపెండెన్స్ వంటి అక్షర రూపాలు ఇవ్వడంతో పాటు మన జాతి గౌరవమైన ముచ్చటైన మూడు రంగుల జెండాను తీర్చిదిద్దారు. భారత పౌరుడు ఓ చేత్తో ఆ జెండాను ఎత్తుకొని మరో చేత్తో రూపాయికి మరమ్మత్తు చేయడానికి ఉపక్రమిస్తున్నట్లు చక్కని సందేశాన్ని ఆ నిడివిలో అమర్చారు. నర్సరీ యాజమాన్యం స్ఫూర్తికి సృజనాత్మకతకు ఇది అద్దం పడుతుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు