Homeఆంధ్రప్రదేశ్పిడుగులపై అపోహలు – సత్యాలు అధికారులు తెలియ చేసి ప్రజల్ని అప్రమత్తం చేయాలి

పిడుగులపై అపోహలు – సత్యాలు అధికారులు తెలియ చేసి ప్రజల్ని అప్రమత్తం చేయాలి

- Advertisement -

*ముంపు ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ముందస్తు గా రిలీఫ్ క్యాంపులు సిద్ధం*

– ఆర్డీవో రాణి సుస్మిత 

విశాలాంధ్ర – కొవ్వూరు :  రానున్న రోజుల్లో వర్షాలు, పిడుగులు ఎక్కువగా ఉండే అవకాశం నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు పిడుగులపై ఉన్న అపోహలకు లోనుకాకుండా సురక్షిత చర్యలు తీసుకోవాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత సూచించారు. గురువారం మండల స్థాయి అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలు, ఇతర విభాగాల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత మాట్లాడుతూ, రానున్న 5 రోజులు సిబ్బంది గ్రామస్థాయిలో 24×7 అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ముంపుకు గురైన ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని, టామ్‌టామ్ ద్వారా ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. గట్లు తెగిన లేదా ముంపు ముప్పు ఉన్న గ్రామాల్లో పునరావాస కేంద్రాలు సిద్ధం చేయబడ్డాయని తెలిపారు. పిడుగుల నుండి రక్షణ కోసం ఇంటి పైభాగంలో మెరుపు రాడ్ (లైట్‌నింగ్ అరెస్టర్) అమర్చడం, పొడవైన చెట్లు లేదా విద్యుత్ స్తంభాల కింద నిలవకుండా ఉండడం, పిడుగు సమయంలో విద్యుత్ పరికరాలను ప్లగ్ నుంచి తీసేయడం, నీటి పైపులు లేదా కుళాయి నీటిని వాడకపోవడం, బయట ఉన్నప్పుడు నేలపై పడుకోకుండా మోకాళ్లపై కూర్చోవడం వంటి చర్యలు పాటించాలని సూచించారు. రిలీఫ్ క్యాంపులు – ముంపు ప్రాంతాల వారీగా సిద్ధం చేసినట్లు తెలిపారు.

1. కొవ్వూరు  మద్దూరు జెడ్‌పి హై స్కూల్, మద్దూరు లంక,  

2. చాగల్లు ..  దారవరం గ్రామం ఎంఎంపీపీ స్కూల్ భవనం, దారవరం , 

3. చాగల్లు తిమ్మరాజుపాలెం గ్రామం ఎంపీయూపీ స్కూల్, తిమ్మరాజుపాలెం, 

4. నిడదవోలు  తాళ్లపాలెం గ్రామం  ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్, తాళ్లపాలెం

5. నిడదవోలు రవిమెట్ల గ్రామం ఎంపీ ఎలిమెంటరీ స్కూల్, రవిమెట్ల

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు