విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజమహేంద్రవరం , దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న కుప్పాల రంగారావు, గోపిరెడ్డి యోహాన్, సిర్రా బంగారుబాబు అలియాస్ రమేష్ లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 34 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డిఎస్ పి కె. రమేష్ బాబు గురువారం మధ్యాహ్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వీటిలో 17 బైకులకు సంబందించి రాజమహేంద్రవరం త్రీటౌన్ , భీమవరం, గుడివాడ, ఏలూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, వీరి ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి నట్లు తెలిపారు. పై కేసులలో ప్రతిభ కనబరచిన త్రీటౌన్ (లా అండ్ ఆర్డర్ ) ఇన్ స్పెక్టర్ వి.అప్పారావు, ఎస్.ఐ వి. అప్పలరాజు, హెచ్‌సిలు వి. కృష్ణ, ఎన్ . వెంకట రామయ్య, కె.సురేష్, చంద్ర శేఖర్, కానిస్టేబుళ్ళు బి. విజయ్ కుమార్, మహేష్, పవన్ లను జిల్లా ఎస్‌పి అభినందించినట్లు ఆయన చెప్పారు.
ముగ్గురు బైక్ దొంగల అరెస్టు ; 34 బైకులు స్వాధీనం.
- Advertisement -
RELATED ARTICLES


