విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై ప్రావీణ్యం సాధించాలి అని శ్రీ బాలాజీ విద్యాసంస్థల అధినేత పల్లె కిషోర్ పేర్కొన్నారు.అనంతపురంలోని పీవీకేకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, కార్పొరేట్ రెడినెస్ ట్రైనింగ్ సెల్ మరియు ఏపీఎస్సీడీసీ సహకారంతో విద్యార్థులకు ఆటోక్యాడ్ , స్టాడ్ ప్రో సాఫ్ట్‌వేర్‌లపై వారం రోజుల సాంకేతిక శిక్షణా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు.ఈ శిక్షణకు ప్రసన్న కుమార్ రిసోర్స్ పర్సన్‌గా , భవనాల ప్రణాళిక, నిర్మాణ విధానాలు, డిజైన్, నిర్మాణాల విశ్లేషణ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ఈ శిక్షణ విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు వారి ప్రణాళికా నైపుణ్యాలను మెరుగుపరిచిందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.బండి రమేష్ బాబు శిక్షణలో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ, ఇలాంటి సాంకేతిక శిక్షణలు విద్యార్థుల వృత్తి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి రాజేష్, కార్పొరేట్ ట్రైనింగ్ , ప్లేస్‌మెంట్ ఆఫీసర్ వహీదా పర్వీన్ సివిల్ ఇంజినీరింగ్ ప్రాధాన్యతను, మౌలిక వసతుల అభివృద్ధిలో ఆధునిక సాఫ్ట్‌వేర్‌ల పాత్రను వివరించారు. ఈ కార్యక్రమానికి సివిల్ ఇంజినీరింగ్ విభాగ అధ్యాపకులు హాజరయ్యారు.
ఏపీఎస్సీడీసీ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ నర్మద అందించిన సహకారాన్ని అభినందించారు.
ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై ప్రావీణ్యం సాధించాలి : పల్లె కిషోర్
- Advertisement -


