Homeజిల్లాలుఅనంతపురంసే నో టు డ్రగ్స్ - ఎస్ టు లైఫ్ ర్యాలీని ప్రారంభించిన వీసీ, ఎస్పీ

సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్ ర్యాలీని ప్రారంభించిన వీసీ, ఎస్పీ

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ సహకారంతో “సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్ అనే నినాదంతో 3 కిలోమీటర్ల రన్ ను యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్,అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జెండా ఊపి 3కే రన్ ను ప్రారంభించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులలో డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాల పై అవగాహన కొరకు ఈ కార్యక్రమం ను నిర్వహించినట్లు అన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు , సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, క్రీడలు, వ్యాయామం , సానుకూల ఆలోచనలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మంచి మార్కులు సాధించడం, క్రీడలు లేదా ఇతర రంగాల్లో నైపుణ్యం సంపాదించడం ముఖ్యమని, చెడు వ్యసనాలకు లోను కాకూడదని ఆయన అన్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల విద్యార్థులు సాధించే లక్ష్యాల పై ప్రభావం చూపుతాయని, వాటికి దూరంగా ఉండి విజయాలు సాధించాలని ఆయన అన్నారు. గంజాయి , ఇతర మాదకద్రవ్యాలకు లోనైన విద్యార్థులు ఎవరైనా ఉంటె మాకు సమాచారం అందించాలని, అందించిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని అన్నారు. సమాచారం తమకు ఇవ్వడం వల్ల ఒక కుటుంబానికి మీరు మేలు చేసిన వారు అవుతారని ఆయన అన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ యువతకు మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ 3కే రన్‌లో విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తమ మద్దతును ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం యువతలో అవగాహన పెంపొందించి వారిని సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. విద్యార్థులు మిట్స్ ఏం.ఎస్.ఆర్ క్లబ్ వాలు డ్రగ్స్ పై స్కిట్ ను వేసి శ్రోతలను అలరించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జెండా ఊపి 3కే రన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఫై. రామనాథన్, అడ్విసెర్ (ఆర్ ,డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు అధ్యాపక సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు