Homeజిల్లాలుపశ్చిమ గోదావరిగద్దర్ అవార్డు అందుకున్న న్యూటన్

గద్దర్ అవార్డు అందుకున్న న్యూటన్

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు : విద్యా వేత్త, సామాజిక సంస్కర్త డాక్టర్ విప్పర్తి ఐజక్ న్యూటన్ పండుకు దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్ఫూర్తి పురస్కారాన్ని సుబ్రహ్మణ్యం మైదానంవద్ద గల అంబెడ్కర్ భవన్ లో దళిత నాయకులు అందజేసారు. న్యూటన్ గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న విద్యా, సామాజిక సేవా కార్యక్రమాలను తెలుసుకొని అభినందించారు. ఐజక్ న్యూటన్ నేటి సమాజానికి ఆదర్శమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతీఒక్కరూ పాటుపడాలని నాయకులు కోరారు. ఐజక్ న్యూటన్ మాట్లాడుతూ ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 73 అవార్డులు వచ్చాయని గద్దర్ పేరుతో అవార్డు రావడం తనపై మరింత భాద్యత పెంచిందన్నారు. కార్యక్రమంలో దళిత, గిరిజన జేఏసి నాయకులు తాళ్లూరి బాబూ రాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, జంగం సుబ్బారావు, ఎల్.వి ప్రసాద్, ధారా ఏసురత్నం, పి. బెనర్జీ, బయ్యే వెంకట్రావు, ఎం. దేవసహాయం విప్పర్తి స్వర్ణ కుమారి, బాబు సొలొమాన్ పండు, మేరీ జొన్స్ అమూల్, సుకేసిని, రాజకుమారి తదితరులు న్యూటన్ సేవలను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు