విశాఖ పట్నం;ఎంవీపి రైతుబజార్ ఎస్టేట్ అధికారి గా విధులు నిర్వహిస్తున్న కె.వరాహలును అభినందిస్తు అల్లిపురం సెయింట్ మదర్ థెరిస్సా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు సేవారత్న సంక్రాంతి పురస్కారం – 2026 ను ప్రధానం చేశారు. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి ప్రముఖుల సమక్షంలో నగరంలోని డాబాగార్డెన్స్ వి.జె.ఎఫ్ ప్రెస్ క్లబ్లో అతనికి బహూకరించారు. గత 18 సంవత్సరాలనుండి నగరంలోని పలు రైతుబజార్లలో తన అమూల్యమైన సేవలు అందిస్తుండటంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నందుకు వరహాలుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేసామని పేర్కొన్నారు. అవార్డు గ్రహీత వరహాలు మాట్లాడుతూ ఈ అవార్డు తనకు ప్రధానం చెయ్యడం ఎంతో ఆనందంగా ఉన్నది, ఇది తనకు తన విధి నిర్వహణ పట్ల, సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల మరింత బాధ్యత పెంచిందన్నారు.
ఎంవీపి రైతుబజార్ ఎస్టేట్ అధికారి వరహాలుకు సేవారత్న అవార్డు
- Advertisement -
RELATED ARTICLES


