– జె వి వి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు
విశాలాంధ్ర ధర్మవరం: మానవ అభివృద్ధి పరిణామ క్రమంలో సైన్స్ దే కీలక పాత్ర అని, దేశ అభవృద్ధి సైన్స్ పైనే ఆధారపడి వుంటుంది అని జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆది శేషు అన్నారు. స్థానిక కాకతీయ విద్యానికేతన్ ,బి యస్ ఆర్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ లో శాస్త్రీయ దృక్పథ ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన “మూఢనమ్మకాలు – వండర్ సైన్స్” అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ నాటి రాతి యుగం నుండి నేటి రాకెట్ యుగం వరకు జరిగిన మానవాభివృద్ధి పరిణామ క్రమంలో సైన్స్ దే కీలక పాత్ర అన్నారు. సైన్స్ మానవ వికాసానికి ఉపయోగపడాలి గానీ మానవ వినాశనానికి కాదు అని ఐన్ స్టైన్ చెప్పిన మాటలను నేడు గుర్తించాల్సిన అవసరం వుందన్నారు.. సైన్సును మానవ వినాశనానికి ఉపయోగిస్తే ప్రపంచం మొత్తం నాశనం అయ్యే ప్రమాదం వుందన్నారు.జె వి వి రాష్ట్ర మ్యాజిక్ కన్వీనర్ బాలబయన్న చేసిన మేజిక్ విద్యార్థులను ఆకట్టుకుంది. పాలు కుండ పెట్టీ ఎటువంటి అగ్గి లేక
ఇటువంటి కార్యక్రమాలు ప్రదర్శిస్తూ కొంతమంది మోసగాళ్లు సమాజంలో చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేస్తూ వీటిల్లో వున్న మ్యాజిక్ మరియు వాటి వెనక ఉన్న లాజిక్ ను విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్, ఐలు నాయకులు ప్రసాద్,కాకతీయ విద్యానికేతన్ కరెస్పాండెంట్ సెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపాల్ నిర్మల, డైరెక్టర్ పద్మ, బి యస్ ఆర్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు ప్రకాష్ మరియు ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
సైన్స్ తోనే దేశాభివృద్ధి
- Advertisement -
RELATED ARTICLES


