Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయ లోక్ అదాలత్ తేదీ మార్పు

జాతీయ లోక్ అదాలత్ తేదీ మార్పు

- Advertisement -

సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కోర్టులో మే 9 వ తేదీన నిర్వహించబోయే జాతీయాలోక్ అదాలత్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూలై 11 వ తేదీన నిర్వహిస్తున్నట్లు సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ జడ్జీలు నందిని,హరీష్, తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో అధికారులకు, న్యాయవాదులకు సమాచారాన్ని తెలియజేయడం జరిగిందని తెలిపారు. కచ్చిదారులకు కూడా న్యాయవాదులు కచ్చితంగా తెలియపరచాలని వారు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయ్యేందుకు న్యాయవాదులు, కక్షిదారులు సహాయ సహకారాలు ఎంతో అవసరమని వారు తెలిపారు. రాజీకు తగ్గ సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు పరిష్కరించుటకు న్యాయవాదుల సహకారం అందించాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులకు సూచించడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు