Homeజిల్లాలుఅనంతపురంబంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా ప్రయాణించరాదు… నార్పల ఎస్ఐ సాగర్

బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా ప్రయాణించరాదు… నార్పల ఎస్ఐ సాగర్

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల:- చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్పల ఎస్ఐ సాగర్ సూచించారు. బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా ప్రయాణించరాదని, ముఖ్యంగా మహిళలు మెయిన్ రోడ్లు, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు ప్రజలను వివిధ రకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎస్ఐ సాగర్ హెచ్చరించారు. “దాహం వేస్తుంది, మంచినీరు ఇస్తారా” అని అడగడం, “అడ్రస్ కోసం వచ్చాం, అడ్రస్ చెప్పండి” అంటూ మాటల్లోకి దించుకొని దగ్గరయ్యే ప్రయత్నం చేయడం వంటి విధానాలతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అడ్రస్ చెప్పడం పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఆభరణాలు దోచుకునే ఘటనలు కూడా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వారిని నమ్మకుండా వెంటనే దూరంగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సాయంత్రం వేళల్లో, జనసంచారం తగ్గే ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. గ్రామాల్లో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని, పిల్లలు, మహిళల భద్రతపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్ఐ సాగర్ సూచించారు. పోలీసులు గస్తీని పెంచి పరిస్థితిని గమనిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు