Homeజిల్లాలుఅనంతపురంఅయ్యో పాపం ...ముళ్ళ పొదల్లో పసికందు

అయ్యో పాపం …ముళ్ళ పొదల్లో పసికందు

- Advertisement -

విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్…. కళ్యాణదుర్గం పట్టణంలో ఓ కసాయి తల్లి ముళ్ళ పొదల్లో శిశువును వదిలి వెళ్లిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే పట్టణ సమీపంలో గ్యాస్ గోడం సమీపంలో ముళ్ళ పొదల్లో ఓ చిన్నారి పసికందు రోదనలను విని అటుగా వెళుతున్న బాటసారులు గమనించి ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో ఐసిడిఎస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని శిశువును క్షేమంగా బయటకు తీశారు. మానవత్వం మరిచి చిన్న పసి కందు ను ఏ తల్లి ఈ ఘటనకు పాల్పడిందోనని చుట్టుపక్కల ప్రజలు స్థానికులు అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు .

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు