ఎన్డిఏ ప్రభుత్వం బీసీలను అణగదొక్కే ప్రయత్నం మానుకోవాలి..
వైద్య విద్య కళాశాలలను ప్రవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం
గుంతకల్లు విశాలాంధ్ర … ఆంధ్ర రాష్ట్రంలో బీసీలను ఎన్ డి ఏ.ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు డి జగదీష్ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ హాజరైనారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని , రాష్ట్రంలో 143 దాకా వెనుకబడిన కులాలు ఉన్నాయని, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచనందువల్ల ఎన్నికలలో పోటీ చేయడానికి ఎక్కువమందికి వీలు లేకున్నట్లు ఉన్నదని అన్నారు. తెలంగాణలో కుల గణన చేపట్టి ,42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి, అలాగే దళితులకు కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు నివేదిక పంపించడం జరిగిందని అన్నారు. కానీ మన రాష్ట్రంలో కుల గణన చేపట్టలేదని ,కులగణ న చేపట్టి బీసీలకు రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ,అందుకు ఈనెల 14 న విజయవాడ లోని శ్రీరామా ఫంక్షన్ హాల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాల నాయకులను ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో చర్చించి, ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుటకు బీసీల తో కార్యచరణ ను తీసుకుంటున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నాడు , రాష్ట్రంలో బీసీలు కు కులగనన చేపడతామని చంద్రబాబు నోటి నుండి మాట రాలేదని దుయ్యబట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం కుల గణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తుందని అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలకు ముందే కుల గణన చేపట్టి విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలల ను ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారు. విద్యాసంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పితే ఫీజులు పెరుగుతాయినీ ఒక సంవత్సరంకు 50 లక్షలు ఖర్చవుతుందని అలా విద్య పూర్తయ్యలోపు రెండు కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. కాబట్టి ప్రైవేట్ పరం చేయడాని సీఎం చంద్రబాబు నాయుడు మానుకోవాలని అన్నారు. అలాగే టూరిజం ప్లాట్లు, టూరిజం హోటల్లో ప్రవేట్ పరం చేయడాన్ని ,పీజీ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయడాని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. విజయవాడలోని గన్నవరంలో ఆర్టీసీ డిపో స్థలాలను కూడా లూలు కంపెనీకి ఇచ్చే ప్రయత్నం మానుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను పెంచే విధంగా ఉండాలీ ,కానీ ప్రభుత్వం ఆస్తులను ప్రవేట్ పరం చేస్తున్నారని ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తులకు ఆదాని ,అంబానీ ల కు కట్టబెట్టిలని చూస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చేస్తున్నాడునీ దేశంలోనే ప్రసిద్ధి గావించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దీంట్లో లక్షలాది మందికి ఉపాధి ఉపాధి పొందుతున్నారని 3000 వేల వర్కర్లను తీసి వేశారని మండిపడ్డారు. బనకచర్ల నుండి రాయలసీమ జిల్లాలకు నీరు ప్రవహిస్తు రైతుల కు పంటలు పండించుకుంటున్నారని అలాంటిది పి పి సి పద్ధతిలో వీటిని కూడా ప్రైవేట్ పరం చేయడానివ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బి గోవిందు, జనసేవ దళ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి ,సిపిఐ జిల్లా సమితి సభ్యులు బి మహేష్, సిపిఐ గుంతకల్ పట్టణ కార్యదర్శి ఎస్ గోపీనాథ్, సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్, సిపిఐ కార్యదర్శి రాము రాయల్, సహాయ కార్యదర్శి రామాంజనేయులు, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు సురేష్,మండల నాయకులు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు


