- Advertisement -
విశాలాంధ్ర . కొత్తచెరువు.… కొత్తచెరువు లోనే బుక్కపట్నం రోడ్ లో శివాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తచెరువు నుండి బుక్కపట్నం వెళుతున్న కారు అందులో డ్రైవరు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్నా మోటార్ సైకిల్ కారును ఢీకొనడంతో మోటార్ సైకిల్ లో వెళ్తున్న బుచ్చయ్య గారి పల్లి గ్రామానికి చెందిన బాబు, చరణ్ కి, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి 108 వాహనంలో వారిని పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మారుతి శంకర్ ,తెలిపారు.


