Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజురెండు బైకులు ఢీ ఒకరి మృతి - ఇద్దరికి గాయాలు

రెండు బైకులు ఢీ ఒకరి మృతి – ఇద్దరికి గాయాలు

- Advertisement -

విశాలాంధ్ర- డుంబ్రిగుడ (అల్లూరి జిల్లా) : మండలంలోని పంతలచింత జాతీయ రహదారి మలుపులో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరి మృతి చెందిన సంఘటన దీనికి సంబంధించి స్థానిక ఎస్సై సురేష్ తెలిపిన వివరాలు కితలంగి పంచాయతీ పింపుల్గుడ గ్రామానికి చెందిన గొల్లోరి సుబ్బారావు (24) అనే యువకుడు డుంబ్రిగుడ నుంచి అరకు వైపునకు వెళ్తుండగా, అరకు నుంచి పాడేరువైపు వస్తున్న బైకు మలుపులో బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుబ్బారావు అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందారన్నారు. మరో ఇద్దరు గాయాలతో కొట్టుమిట్టడాడుతుండగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతదేహాన్ని అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు