విశాలాంధ్ర – అనంతపురం టౌన్జా : తీయ బాలిక దినోత్సవం సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కేఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాల నందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఇన్చార్జ్ అధికారి డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ… బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ముఖ్యంగా అత్యున్నత విద్యను అభ్యసించాలని, ఉన్నత పదవులు చేపట్టాలని బాల్యవివాహాలను పూర్తిగా రూపు మాపాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవా సదన్ జడ్జ్ రాజశేఖర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు పూర్తిగా నివారించాలని బాల్యవివాహాలు అలాగే రాజ్యాంగంలో బాలికల కోసం మహిళల కోసం రూపొందించినటువంటి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ప్రతి బాలిక బడి బయట కాకుండా బడిలో ఉండాలని బాలికలు మహిళలు చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం దక్కుతుందని కుటుంబంలో విద్యావంతరాలు ఉన్నప్పుడే కుటుంబం చదువుకోవడానికి అవకాశం ఉంటుందని తద్వారా సమాజంలో విద్యావంతులుగా గౌరవప్రదమైన స్థానాలు దక్కుతావని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి సమత ఆర్గనైజేషన్ డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ… రాజ్యాంగం కల్పించిన హక్కులను అవకాశాలను బాలికలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వాటిని అమరుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం మాస్ మీడియా అధికారి ఈ నాగరాజు, ఉప మాస్ మీడియా అధికారి లక్ష్మీనారాయణ, ఆరోగ్య బోధనా అధికారి గంగాధర్, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ భానుజా, కేసర్ బాలికలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయినీలు, వైద్య శాఖ సిబ్బంది వేణుగోపాల్, విజయ్, వెంకటేష్,,లీగల్ అడ్వైజర్ ఆషారాణి తదితరులు పాల్గొన్నారు.
బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
- Advertisement -


