Thursday, January 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎన్టీఆర్ ఫ్యాన్స్ నూతన క్యాలెండర్లను విడుదల చేసిన వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ నూతన క్యాలెండర్లను విడుదల చేసిన వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్..

తారక్ చేయిత ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్, తారక్ చేయుట ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి, వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తదితరులు ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2025 ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్యాలెండర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తారక్ చేయూత ట్రస్టు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన సంఘం చేస్తున్న పలు సేవలు ప్రజల వద్ద ఎంతగానో మన్ననలు పొందడం నిజంగా గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా తారక్ చేయుట ట్రస్టులో రాత్రిపూట అనాధలకు, యాచకులకు, దిక్కులేని వారికి వారి ఇంటి వద్దనే భోజన పంపిణీ చేయడం అనేది గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. అనంతరం రామాజీ మాట్లాడుతూ దాతల సహాయ సహకారములతోనే గత కొన్ని సంవత్సరాలుగా రాత్రిపూట అనాధలకు, యాచకులకు, దిక్కులేని వారికి, ఒంటరి వాళ్ళ ఇంటి వద్దకే వెళ్లి భోజనం పంపిణీ చేయడం దైవ సేవగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకి, రమేష్ తారక్, కార్యదర్శి నవ కుమార్, కోశాధికారి ముత్యాలు, ప్రధాన కార్యదర్శి తుకారాం, సభ్యులు గురు, హేమంత్, వేణు, చరణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు