జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు బుధవారం ఆపరేషన్ ఛత్రును ప్రారంభించాయి.కిష్త్వార్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారన్న గూఢచారి సమాచారం రావడంతో బలగాలు అక్కడకు చేరుకుని వారిని పూర్తిగా ముట్టడించాయి.దీనితో సైనికులు,ఉగ్రవాదుల మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్లు తెలిసింది.కిష్త్వార్‌లోని ఛత్రు ప్రాంతంలో ఆ ముగ్గురుఉగ్రవాదులు గతకొన్ని నెలలుగా నల్లచాటున ఉంటున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి.ఈసమాచారంపై ఆధారపడి భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్,కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు తెల్లవారుజామునే ఇంటి ఇంటికీ తనిఖీలతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.ఉగ్రవాదులు ఉన్న ప్రదేశాన్ని ఖచ్చితంగా గుర్తించిన భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టాయి.ఫలితంగా రెండువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.


