విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) సాఫ్ట్‌బాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బుడగల అక్షయ్ సాగర్ ‘బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025-2026’ అవార్డును అందుకున్నారు. కాకినాడ సమీపంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో శనివారం ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా
వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో, వర్సిటీ ప్రో-ఛాన్సలర్ సతీష్ రెడ్డి చేతుల మీదుగా అక్షయ్ సాగర్ ఈ జ్ఞాపికను స్వీకరించారు. అనంతపురం జిల్లా రాప్తాడు విశాలాంధ్ర సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్, కీర్తిశేషులు ఉమాదేవి
దంపతుల కుమారుడైన అక్షయ్ సాగర్ సాధించిన ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, యూనివర్సిటీ యాజమాన్యం అక్షయ్ తండ్రి శ్రీనివాస్‌ను వేదికపై శాలువాతో ఘనంగా సన్మానించింది. క్రీడల్లో విద్యార్థులు రాణించేలా తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం ఎంతో అభినందనీయమని ప్రో ఛాన్స్ లర్ సతీష్ రెడ్డి కొనియాడారు.
క్రీడల్లో రాణిస్తూ కళాశాలకు, రాప్తాడు ప్రాంతానికి మంచి పేరు తెస్తున్న అక్షయ్ సాగర్‌ను వర్సిటీ అధ్యాపకులు, తోటి విద్యార్థులు, స్థానిక ప్రముఖులు, ప్రజలు అభినందించారు.
సాఫ్ట్‌బాల్ క్రీడలో విశేష ప్రతిభ: అక్షయ్ సాగర్‌కు ‘బెస్ట్ పెర్ఫార్మర్’ అవార్డు
- Advertisement -


