విశాలాంధ్ర నందిగామ:-80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నందిగామ సిపిఐ కార్యాలయంలో సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కట్టా చామంతి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి చుండూరు సుబ్బారావు, ఎస్కే మౌలాలి,వాసిరెడ్డి నవీన్, బొలుసుపాటి రాంబాబు, తుఫాన్ బాబు తదితరులు పాల్గొని జండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ప్రతిజ్ఞ చేశారు భారత రాజ్యాంగంలోని లౌకిక, ప్రజాస్వామిక,సౌమ్య వాద విలువలను పరిరక్షించడానికి, దేశ ప్రజలంతా సామాజిక,ఆర్థిక, రాజకీయ,న్యాయాలను సాధించడానికి సిపిఐ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని నాయకుల ప్రతిజ్ఞ చేశారు మార్పు కావాలి మార్పు రావాలి అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రైవేటీకరణను మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తామని అన్నారు ప్రజల హక్కుల పరిరక్షణ శాంతి,సమావత్వం,సౌబ్రా తృత్వం కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇంక్విలాల్ జిందాబాద్ నినాదాలతో సిపిఐ కార్యాలయం హోరెత్తించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసి వందన కార్యక్రమం నిర్వహించారు….
సిపిఐ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…
- Advertisement -
RELATED ARTICLES


