Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేతన్న సేవలో జరిగిన అవినీతి అక్రమాలపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలి..

నేతన్న సేవలో జరిగిన అవినీతి అక్రమాలపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలి..

- Advertisement -

ఏపీ చేనేత కార్మిక సంఘం సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; నేతన్న సేవలో జరిగిన అవినీతి అక్రమాలపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని, సచివాలయాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై హ్యాండ్లూమ్ ఏది నైతిక బాధ్యత వహించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్ లతో కలిసి వెంకటనారాయణ మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేతన్న సేవ పథకం అమలు చేసింది ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చీరాల లో నేతన్న సేవ పథకం అమలు చేయడం జరిగింది కానీ ఈ నేతన్న సేవ పథకంలో నిజమైన చేనేత కార్మికులకు అదే రోజు కేవలం కొంతమందికి మాత్రమే జమ కావడం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు కాకుండా అనర్హులకు నేతన్న సేవ డబ్బులు జమ అయ్యాయని కార్మికులు ఆవేదన చెందుతు నిరసన వ్యక్తం చేయడం జరిగింది అని తెలిపారు. మళ్లీ ఇప్పుడు రెండు రోజులు టైమ్ ఇచ్చి ఎవరికైతే నేతన్న సేవ పథకం అమలు కానీ వారికి అవకాశం ఇచ్చారు ఆగస్టు 14వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉందని పథకం అందని వారు అప్లై చేసుకోవాలని హ్యాండ్ లూమ్ అధికారులు తెలియజేయడం జరిగింది అని తెలిపారు. ఈ సారైనా హ్యాండ్ లూమ్,అధికారులు సచివాలయం ఉద్యోగులు నిజమైన లబ్ధిదారులను గుర్తించి మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మిక కుటుంబాలకు నేతన్న సేవ పథకం కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రెండవ విడత నిధులు ఎప్పటిలోగా జమ చేస్తారో తెలియచేయాలని అన్నారు ఈసారి కూడా నిజమైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు ఇస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని దీనికి పూర్తి బాధ్యత హ్యాండ్లూమ్ ఏడి, మున్సిపల్ కమిషనర్ , సచివాలయ సిబ్బంది బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. కార్మికులకు నేతన్న సేవ పథకం నిధులు కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ కాని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల తో చేనేత మంత్రి సవితమ్మ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు శ్రీనివాసులు, శివ, సంకారపు రాజా, ఆది నారాయణ లు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు