యువర్స్ ఫౌండేషన్ కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున, శిబిర నిర్వాహకులు రాధాకృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేట, రాంనగర్ లోని శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల యందు నిర్వహించిన ఉచిత డయాబెటిక్ శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ కార్యదర్శి జయరాం కోశాధికారి వెంకట నాగార్జున, క్యాంపు నిర్వహకులు రాధాకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి డాక్టర్ నెట్టెం శ్రీకాంత్ చౌదరి రోగులకు వైద్య పరీక్షలను నిర్వహించి, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, మీనాక్షి ఎండోక్రయిన్ అండ్ పీడియాట్రిక్ సెంటర్ అనంతపురం వారి సహకారంతో నిర్వహించామని తెలిపారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, యూరిన్ పరీక్షలతో పాటు ఉచితంగా చేస్తూ ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ శిబిరంలో 150 మంది రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. ఇప్పటికే యువర్స్ ఫౌండేషన్ సంస్థ పలు రకాల సేవలను అందిస్తూ ప్రజల వద్ద మంచి గుర్తింపు పొందడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డివి సుబ్బారావు, రత్రశాల మల్లికార్జున, బిమిశెట్టి కృష్ణమూర్తి, చాంద్ భాషా, మాజీ కౌన్సిలర్ కేత లోకేష్, కళ్యాణ చక్రవర్తి, సాకే వాసు, పోలా ప్రభాకర్, శివారెడ్డి, గేలి శివ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత డయాబెటిక్ శిబిరమునకు విశేష స్పందన
- Advertisement -
RELATED ARTICLES


