పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం;;క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత, ఐక్యంగా పోరాటాలను ఉధృతం చేయాలని క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా ధర్మవరం పట్టణంలో విద్యార్థులతో కలిసి పోస్టర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంజుల నరేంద్ర మాట్లాడుతూ 1942 ఆగస్టు 8న గాంధీజీ ఇచ్చిన చేయండి లేదా చావండి పిలుపు దేశ ప్రజల్లో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించిందన్నారు అదే స్ఫూర్తితో నేడు ప్రజాస్వామ్యం,లౌకికత,రాజ్యాంగ హక్కులు, విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం,విద్యార్థులకు నాణ్యమైన విద్య–ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రజా రంగ సంస్థలను పరిరక్షించడం, సామాజిక న్యాయాన్ని అమలు చేయడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నించేందుకు విద్యార్థులు,యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రజల హక్కులను హరించే విధానాలను ప్రశ్నించేందుకు ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి యువత ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మొండి నందకిషోర్, హరి,గుణ, విద్యార్థులు పాల్గొన్నారు.


