విశాలాంధ్ర -ధర్మవరం ; నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యల్ని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆర్డీవో మహేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీవో ముందు నియోజకవర్గ సమస్యలను వివరిస్తూ, వెంటనే న్యాయం చేయాలని వారు కోరడం జరిగింది. ఇందులో భాగంగానే ఆర్ఓబి కోసం ఇల్లు కోల్పోయిన వారికి పూర్తి స్థాయిలో పరిహారం ఇప్పించాలని, హిందూ ముస్లిం స్మశాన వాటికల సమస్యలను పరిష్కరించాలని, పెద్దకోట్ల గ్రామస్తులకు న్యాయం చేయాలని వారు తెలిపారు.. ఇందులో ప్రధానంగా కదిరి రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద నిర్మాణం కోసం ఇళ్లు కోల్పోయిన బాధితులకు సరైన పరిహారం అందలేదు అని తెలిపారు. గతంలో ఈ అంశంలో బాధితుల పక్షాన తాను చెడ్డ పరంగా పోరాడడం జరిగిందని తెలిపారు.తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పనులు ప్రారంభం కావడంతో బాధితులు తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు అని తెలిపారు. ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నేటి ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ధర్మవరంలోని హిందూ స్మశాన వాటిక, ముస్లింలకు చెందిన ఖబరస్తాన్ సమస్యల్ని కూడా ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఖబరస్తాన్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో పాటు వర్షపు నీరు లోపలికి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. హిందూ స్మశాన వాటిలో కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. స్థలం కూడా చాలా తక్కువగా ఉందని వివరించారు. పట్టణ సమీప ప్రాంతంలో హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని తెలిపారు. వీటిన్నింటిపై తహసీల్దార్ ను పిలిపించి ఆర్డీఓ చర్చించారు. సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. మరోవైపు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపుకు గురి అయిన తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామస్తులకు సరి అయిన పరిహారం దక్కలేదని విషయాన్ని కూడా తెలపడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పరిహారంలో తమకు అన్యాయం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆడివో మహేష్ స్పందిస్తూ అన్ని అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం చేసే విధంగా తాను కృషి చేస్తానని పరిటాల శ్రీరామ్కి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, బాధితులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల్ని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లిన పరిటాల శ్రీరామ్
RELATED ARTICLES