Homeఆంధ్రప్రదేశ్శాంతియుతమైన జీవనం ఎమ్మెల్యే బత్తుల

శాంతియుతమైన జీవనం ఎమ్మెల్యే బత్తుల

- Advertisement -

శాంతియుతమైన జీవనం మానవుని ఉన్నతికి దోహదం
– ఘనంగా శ్రీ సత్య సాయిబాబా శతజయంతి  ఉత్సవాలు
-ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ 
విశాలాంధ్ర – రాజానగరం : ప్రస్తుత పోటీ ప్రపంచంలో శాంతియుతమైన జీవనంతో మానవుని ఉన్నతికి మరింత దోహదపడుతుందని రాజానగరం నియోజక వర్గ శాసనసభ్యులు బత్తుల బలరామ కృష్ణ అన్నారు. 
మండల కేంద్రమైన రాజానగరంలోని ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపిడివో ఝాన్సీరాణి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన శ్రీ సత్య సాయిబాబా  శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి,రాజమహేంద్రరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్
(ఆర్డివో)ఆర్.కృష్ణా నాయక్ తో కలిసి సత్య సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి బాబా వారికి హారతి అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ సత్య సాయి బాబా వంటి మహనీయులు చూపిన మార్గంలో ప్రతిఒక్కరు  పయనించాలని కోరారు. సత్య సాయి బాబా దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లపుడు ఉండాలని ఆకాంక్షించారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబాచే స్థాపించబడిన “సేవా కమిటీ”ద్వారా నేటికి మానవతా సేవలు, వైద్య సంరక్షణ, తాగునీటి ప్రాజెక్టులు, విద్య వంటి రంగాలలో పనిచేస్తుందన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డివో) ఆర్.కృష్ణా నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు మేరకు సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఝాన్సీరాణి, తహశీల్దార్ జి.అనంత లక్ష్మీ సత్యవతి దేవి,సీనియర్ అసిస్టెంట్ ఎం.సుబ్రమణ్యం,వివిధ శాఖల అధికారులు, నాయకులు తోట రామకృష్ణ, కిమిడి శ్రీరాం, వడ్డీ చిన్న, మోదీ సత్తిబాబు, ఏఎంసి డైరెక్టర్ సైతిని లక్ష్మీ,సైతిని చల్లారావు,ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కానవరం గ్రామంలో ————————-
తమతోటి వారి పట్ల ప్రేమ, క్షమ,దయ,ఇతరులకు సహాయం చేయడం వంటి అంశాలపై యువత దృష్టిసారించాలని రుడా ఛైర్మన్, నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకట రమణ చౌదరి అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతినీ పురస్కరించుకొని మండలంలోని కానవరం గ్రామంలో ఆదివారం జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రుడా ఛైర్మన్ తొలుత బాబా రూపంతో ఉన్న కేక్ కోసి భక్తులకు పంచారు.దీనిలో భాగంగా స్తానిక నాయకులు రుడా ఛైర్మన్ నీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఎంపీ బచ్చు ప్రసాద్, నాయకులు సంగీత సత్యనారాయణ, యళ్ళ వెంకటరత్నం,రావిశెట్టి  రాంబాబు,సంగీత శ్రీనివాసరావు (శ్రీను), సంగీత అమ్మిరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు