Tuesday, November 18, 2025
Homeఆంధ్రప్రదేశ్చవితి విగ్రహాలకు అనుమతులు తప్పనిసరి

చవితి విగ్రహాలకు అనుమతులు తప్పనిసరి

- Advertisement -

 

– రహదారి రాకపోకలకు అంతరాయాలు వద్దు

విశాలాంధ్ర – సీతానగరం: రాబోయే వినాయక చవితి విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అని మండల అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసిల్దార్ ఏ శ్రీనివాస్, ఎంపిడిఓ ఎమ్ భారతి, ఎస్సై డి రామ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆగస్టు 27న జరగబోయే వినాయక చవితి విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అని అన్నారు. అలాగే విగ్రహాలు నిమజ్జనం చేసే రోజు ముందుగా అధికారులకు తెలపాలన్నారు. అలాగే నిమజ్జనం వంగలపూడి, మునుకూడలి రేవులలో పగటి పూట మాత్రమే చేయాలని ఆదేశించారు. మరి ముఖ్యంగా విగ్రహాలు సైజు ఆరు అడుగులు మించి ఉండకూడదు అని అన్నారు. ఇక ప్రధానంగా సామాన్య ప్రజలకు ఇబ్బందుల కలగకుండా రహదారులు పై విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించ కుండా చర్యలు చేపట్టాలని అని గ్రామ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తుపాను వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు వరదల పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో కె ఎస్ ఎస్ ఎస్ మూర్తి, ఏ ఓ సుబ్రమణ్యం, అన్ని గ్రామాల విఆర్ఓలు, పంచాయితీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు