Tuesday, November 18, 2025
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

- Advertisement -

 విశాలాంధ్ర -నిడదవోలు : వెయ్యి పదాలతో వర్ణించలేని దానిని ఒక్క ఫోటోతో నిర్వర్తించవచ్చునని మున్సిపల్ చైర్ పర్సన్ భూపతి ఆదినారాయణ అన్నారు.తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు స్థానిక రోటరీ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ మీసాల శివరామ హరిప్రసాద్ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు పట్టణ ప్రథమ పౌరులు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ ఫోటోగ్రఫీకి డాగురే చేసిన సేవలను కొనియాడారు. ఆయన సృష్టించిన కెమెరా ఎంతోమందికి ఉపాధి కల్పించిందన్నారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యుల ఆధ్వర్యంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ మీసాల శివరామ హరిప్రసాద్, సెక్రటరీ దారపురెడ్డి శ్రీ రామ ప్రతాప్, ట్రెజరర్ గుంటిపల్లి సత్యసాయి, రొటీరియన్స్ గోపిరెడ్డి శ్రీనివాస్, నీలం నాగేంద్రప్రసాద్, పోలదాసు శ్రీనివాసరావు పొన్నా సుబ్రహ్మణ్యo, కేదారిశెట్టి రవికుమార్, ఎండి ఫయాజ్, సానేపు వెంకటసుబ్బారావు, యాసరపు రామకృష్ణ మరియు పొడుగు నరేష్, అరిగెల నరసింహమూర్తి, తన్నీడి బోస్, దారపురెడ్డి సూర్యచందర్రావు మరియు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు